వీడియో తీస్తూ.. మైనర్ పై గ్యాంగ్ రేప్..!

5 May, 2016 09:59 IST|Sakshi
వీడియో తీస్తూ.. మైనర్ పై గ్యాంగ్ రేప్..!

సిడ్నీ: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ వ్యక్తికి జీవితకాల జైలుశిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన సిడ్నీలో కొన్ని రోజుల కిందట జరిగింది. ట్రిస్టాన్ కార్లైల్ వాట్సన్ అనే యువకుడిని ఓ కేసులో భాగంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ నకు గురై అపస్మారస్థితిలో బాలిక పడి ఉండగా వాట్సన్ తీసిన వీడియో స్థానికంగా హల్ చల్ చేస్తోంది. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ మైనర్ దోషిగా ఉన్నాడు.

వాట్సన్ అనే యవకుడు ప్రధానంగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే, ఆ దారుణానికి గురైన బాలికతో ఫేస్ బుక్ లో అతడు ఫ్రెండ్ గా ఉండటమే కారణమని తెలుస్తోంది. పశ్చిమ సిడ్నీలో సెయింట్ క్లెయిర్ పార్టీ రమ్మని ఆ బాలికను వాట్సన్ ఆహ్వానించాడు. అక్కడ ఆ మైనర్ బాలిక మద్యం సేవించింది. కొద్దిసేపట్లో బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన వాట్సన్, కొందరు యువకులు మైనర్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్లాన్ ప్రకారమే బాలికను రప్పించి అత్యాచారం చేశారని కోర్టులో రుజువైంది.

వాట్సన్ అత్యాచారం చేసినట్లు వీడియోలో కనిపించలేదని అతడి తరఫు న్యాయవాది వాదించాడు. ఆ బాలికతో కూడా మాట్లాడి పూర్తివివరాలు తెలుసుకోవాలంటూ కోర్టుకు విన్నవించారు. అయితే అత్యాచారానికి గురైన బాలికను వాట్సన్ తీసిన ఫొటోలతో పాటు అతడి ఫొటో కూడా పోలీసులకు లభ్యమైంది. శుక్రవారం రోజు ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. మైనర్ బాలిక వివరాలు వెల్లడించేందుకు కోర్టు, పోలీసు శాఖ నిరాకరించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు