మెక్సికోను కుదిపేసిన భూకంపం

20 Sep, 2017 16:31 IST|Sakshi
మెక్సికోను కుదిపేసిన భూకంపం

మెక్సికో సిటీ: మెక్సికో దేశాన్ని మంగళవారం అత్యంత శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 226మందికి పైగా మరణించారు. మృతుల్లో 21 మంది ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు ఉన్నారు. వేలాది మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్యూబ్లాకు తూర్పు వైపున భూకంప కేంద్రం నమోదైనట్లు మెక్సికో భూకంప శాస్త్ర అధ్యయన సంస్థ తెలిపింది.

ప్యూబ్లా, మొర్లస్‌, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. ఇటీవలే భూకంపం, తుపాను వల్ల మెక్సీకో తీవ్రంగా నష్టపోయింది. 1985 సెప్టెంబర్‌ 19న కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. నాటి ప్రమాదంలో దాదాపు 10 వేల మంది వరకు మృతి చెందారు. 32 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు(మంగళవారం) భారీ భూకంపం సంభవించింది. మెక్సికోకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


Liveblog

>
మరిన్ని వార్తలు