పాక్, చెచెన్ ఉగ్రవాదులకు నార్వేలో జైలు

3 Aug, 2016 19:19 IST|Sakshi

ఓస్లో: పాకిస్థాన్, చెచెన్ దేశాలకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు ఓస్లో కోర్టు జైలు శిక్ష విధించింది. వారిద్దరు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో చేతులు కలిపినందుకు వరుసగా ఆ ఇద్దరికి ఆరు, ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అదామ్ ఇద్రిసోవిక్ అనే చెచెన్ సంతతికి చెందిన రష్యన్ పౌరుడు(23), హసన్ అహ్మద్(46) నార్వేలోని దక్షిణ ప్రాంతంలో కలిసుండేవారు.

2014లో ఇరాక్, సిరియాలను తమ ఆధీనంలోకి పూర్తిగా తీసుకోవాలని ఇస్లామిక్ స్టేట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారిద్దరు కలిసి సిరియాకు వెళ్లారు. అనంతరం అక్కడ వారితో చేతులు కలిపి కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేసిన నార్వే పోలీసులు చివరకు అన్ని ఆధారాలతో కోర్టుకు తీసుకెళ్లగా వారి పై శిక్షలు విధించింది.

మరిన్ని వార్తలు