చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!

15 May, 2015 08:32 IST|Sakshi
చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!

బీజింగ్: మోదీ పర్యటన సందర్భంగా చైనాకు వెళ్లి అక్కడ ఉంటున్న తన సవతి సోదరిని కలుసుకోవాలని చెన్నై మహిళ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చైనాలో ఉంటున్న తన సవతి సోదరిని ఎట్టకేలకు ఆమె కలుసుకోగలిగారు. తన సవతి సోదరి యాన్ రోసాయి(81) ఆచూకీ తెలుసుకుని, కలుసుకునేందుకు సాయం చేయాలంటూ చెన్నైకి చెందిన జెన్నిఫర్ యాన్(62) అనే మహిళ ఇటీవల ప్రధానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, అధికారుల ప్రమేయం అవసరం లేకుండానే, సోషల్ మీడియా, రేడియోల చొరవతో వారిద్దరూ ఎట్టకేలకు కలుసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ముదిమిలో ఇలా కలుసుకోగలగడంతో ఇద్దరూ భావోద్వేగంతో ఆనంద బాష్పాలు రాల్చారు.

మరిన్ని వార్తలు