చెరిల్ జేమ్స్ మరణంపై మరోసారి విచారణ!

3 Feb, 2016 08:32 IST|Sakshi
చెరిల్ జేమ్స్ మరణంపై మరోసారి విచారణ!

బ్రిటిష్ ఆర్మీకి చెందిన డీప్ కట్ సైన్య శిబిరాల్లో లైంగిక వేధింపుల సంస్కృతి కొనసాగుతున్నట్లు గతంలో ఎన్నో ఆధారాలు కనిపించినా పట్టించుకున్నవారే లేరు. అయితే సైన్యంలో శిక్షణ పొందుతూ  'చెరిల్ జేమ్స్'  మరణించడం వెనుక దారుణ చరిత్ర ఉందని తాజా విచారణలో బయట పడుతోంది. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో అప్పట్లో కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా చెరిల్ జేమ్స్ మరణంపై న్యాయ విచారణ చేపట్టాలని ఆమె కుటుంబం తరపున  మానవ హక్కుల సంఘం ముందుకు రావడంతో తిరిగి విచారణ ప్రారంభమైంది.

1995 లో డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతున్న చెరిల్ జేమ్స్ బుల్లెట్ గాయాలతో మరణించింది. అయితే అప్పటినుంచీ విచారణ చేపట్టిన కోర్టు... 2014 లో తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది. తాజాగా 18 ఏళ్ళ.. సోల్జర్ పీటర్ జేమ్స్ కేసులో ఆమె కుటుంబం తరపున లిబర్టీ మావన హక్కుల సంఘం... కోర్టు ముందు తన వాదనను వినిపించింది. బ్రియాన్ బార్కర్ క్యూసీ అధ్యక్షతన ప్రారంభమైన న్యాయ విచారణకు ముందు.. పీటర్ జేమ్స్ తండ్రి.. దేశ్... తన కుమార్తెతోపాటు, డీప్ కట్ లో వేధింపులతో మరణించిన యువసైనికులందరికీ న్యాయం జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

డీప్ కట్ క్యాంపులో అదుపులేని మద్యం, డ్రగ్ సంస్కృతి కూడా కొనసాగుతున్నట్లు తమకు తెలిసిందని దేశ్ వెల్లడించారు. శిబిరంలో కొనసాగుతున్న ఇటువంటి దారుణ సంస్కృతే నలుగురు యువ సైనికుల మరణానికి కారణమైందన్నారు.  ఐస్ బర్గ్ కు చివరి భాగంలో ఉండే డీప్ కట్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు ఇప్పటికైనా ప్రపంచానికి తెలియాలని, ఆ నలుగురు యువ సైనికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా డీప్ కట్ శిబిరంలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తమ కూతుర్ని కోల్పోయిన నేటి తరుణంలోనైనా అక్కడి దారుణ చరిత్ర బహిర్గతం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. 1995-2002 మధ్య చెరిల్ జేమ్స్ తో పాటు... బెంటన్ జేమ్స్, కొలిన్, జియోఫ్ గ్రే కూడా డీప్ కట్ లో తుపాకీ గాయాలతోనే మరణించారు.

కుడికన్నుకు, ముక్కుకు మధ్య భాగంలో తగిలిన బుల్లెట్ గాయంతో 1995 లో పీటర్ జేమ్స్ మరణించింది. ఆ సమయంలో ఆమె... బ్రిటన్ సౌత్ వేల్స్ లంగోలెన్ లోని డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతోంది. 1995- 2002 కు మధ్య డీప్ కట్ లో బుల్లెట్ గాయాలతో మరణించిన యువ సైన్యం నలుగురిలో జేమ్స్ ఒకరు. అక్కడి వేధింపుల సంస్కృతి నేపథ్యంలోనే వారంతా మరణించినట్లు అంతా అనుకున్నా.. కోర్టుకు తగిన సాక్ష్యాలు మాత్రం అందించలేక పోయారు. అయితే  మొదటి దర్యాప్తులో జరిగిన న్యాయ విచారణకు విరుద్ధంగా తాజా విచారణలో కనీసం 100 మంది సాక్షుల ఆధారాలను అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గంటపాటు జరిగిన విచారణలో ఏడుగురు సాక్షులను ప్రవేశ పెట్టి వారి సాక్ష్యాలను రికార్డు చేశారు. పీటర్ జేమ్స్ తన మరణానికి కొద్ది సమయం ముందు సీనియర్ల లైంగిక దాడికి గురైందన్న ఆరోపణ నేపథ్యంలో ఈ తాజా విచారణ ప్రారంభమైంది.

>
మరిన్ని వార్తలు