430కు కొన్నాడు. 6కోట్లకు అమ్ముడుపోయింది!

3 Jul, 2019 12:59 IST|Sakshi
ప్రాచీన చదరంగం పావు..

ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు.. లండన్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా రూ. 6.3 కోట్లకు అమ్ముడుపోయింది. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్‌ చెస్‌మ్యాన్‌ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల (రూ. 430)కి కొనుగోలు చేశాడు. లండన్‌ సౌత్‌బైలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఓ గుర్తుతెలియని బిడ్డర్‌ ఈ పావును 7.35 లక్షల పౌండ్ల (రూ. 6.3 కోట్ల)కు సొంతం చేసుకున్నాడు. సైనిక యోధుడి రూపంలో ఉన్న ఈ పావు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంది. 12వ శతాబ్దానికి చెందిన వార్లస్‌ అనే సముద్ర జంతువు దంతంతో ఈ పావును తయారు చేశారు. నార్సె యోధుల రూపంలో లెవిస్‌ చెస్‌మ్యేన్‌ పావులు ఉంటాయి. యూరోపియన్‌ చరిత్రలో వైకింగ్‌ శకానికి (క్రీ.శ. 800 నుంచి 1066 మధ్యకాలం) చెందిన ఈ కాలపు కళాకృతులు ఎంతో విశిష్టమైనవి. వీటికి మార్కెట్‌లో గొప్ప ధర పలుకుతుంది. 

రూర్క్‌ (చదరంగంలో ఏనుగు)ను తలపిస్తున్న ఈ పావును స్కాటిష్‌ ప్రాచీన కళాకృతుల డీలర్‌ వద్ద మొదట కనుగొన్నారు. ఇలాంటి చదరంగం పావులు 1831లో స్కాట్లాండ్‌లోని ఇస్లే ఆఫ్‌ లెవిస్‌లో పెద్ద ఎత్తున లభించాయి. మొత్తం ఐదు సెట్ల చెస్‌ పావులు అక్కడ దొరికాయి. వాటి నుంచి అదృశ్యమైన ఈ చెస్‌పావు.. కాలక్రమంలో అనేకమంది చేతులు మారుతూ.. చివరకు గత మంగళవారం లండన్‌లో వేలంపాటకు వచ్చినట్టు భావిస్తున్నారు. 1964లో ఎడిన్‌బర్గ్‌కు చెందిన డీలర్‌ తమ నుంచి ఈ చెస్‌ పావును రూ. 430కి కొనుగోలు చేసినట్టు స్కాటిష్‌ డీలర్‌ కుటుంబం ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఎట్టకేలకు టర్కీకి చేరిన ఎస్‌-400

మన పడక గదులకు అవే ‘చెవులు’

విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు

ప్లాస్టిక్‌ ఇల్లు

అందులో మోదీ మాస్టర్‌ : యూఎస్‌ స్పీకర్‌

ఉందిలే మంచి కాలం

గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ షాక్‌

ఈసారి ఇరాన్‌ వంతు..బ్రిటన్‌ నౌక అడ్డగింత

డేంజర్‌; అక్కడికెళ్తే అంతే సంగతులు!

ఇస్తాంబుల్‌కు భూకంప ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!