ఆ వయసులో యాంటీ బయోటిక్స్ వాడితే...

2 Sep, 2016 16:08 IST|Sakshi
ఆ వయసులో యాంటీ బయోటిక్స్ వాడితే...

న్యూయార్క్ః పుట్టిన బిడ్డలకు మొదటి సంవత్సరం నుంచే యాంటీ బయోటిక్స్ వాడకం ఫుడ్ ఎలర్జీలకు దారి తీస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. యేడాదిలోపు పిల్లలకు యాంటీబయోటిక్స్ వాడిన పిల్లలతోపాటు, వాడని వారిపై అధ్యయనాలు జరుపగా...మందులు వాడని వారికంటే, వాడినవారికి 1.21 అధికంగా ఫుడ్ అలర్జీలు వచ్చినట్లు తెలుసుకున్నారు.

సూక్ష్మ జీవులవల్ల వ్యాపించే పలు రకాల వ్యాధులను ఎదుర్కొనేందుకు,  వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చేందుకు వాడే యాంటీబయోటిక్స్ యేడాదిలోపు పిల్లలకు వాడటంవల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. యాంటీబయోటిక్స్ తో ఇతర సైడ్ ఎఫ్టెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా గుర్తించారు. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి,  ఫుడ్ అలర్జీలు వంటివి వ్యాపిస్తాయని తమ అధ్యయనాల్లో తేలినట్లు అమెరికా సౌత్ కరోలినా ఫార్మసీ కళాశాలకు చెందిన అధ్యయనకారుడు బ్రియాన్ లవ్ చెప్తున్నారు.

మొత్తం 1,504 మంది ఫుడ్ అలర్జీ ఉన్న పిల్లల కేసులతోపాటు, 5,995 అలర్జీలు లేని వారి గణాంకాలను పరిశోధకులు పరిశీలించారు. తమ పరిశోధనలను అలర్జీ, ఆస్థమా అండ్ ఏఎంపీ, క్లినికల్ ఇమ్యునాలజీ జర్నల్ లో ప్రచురించారు.

మరిన్ని వార్తలు