ఈ హోటల్లో మొసలితో ఆడుకోవచ్చు..

6 Oct, 2017 17:02 IST|Sakshi

బీజింగ్‌: మొసళ్ల అంటే ఎంత భయం.. చూస్తేనే ఒళ్లు గగుల్పొడుస్తుంది. అలాంటిది అది పక్కన ఉండగా భోజనం ఎలా చేస్తం.. భయంతో చచ్చిపోతాం. కానీ చైనాలోని ఓ రెస్టారెంట్‌లో ఎంచక్కా దానితో సెల్ఫీ దిగవచ్చు.. ఆడుకోవచ్చు. రెస్టారెంట్‌కు కస్టమర్లను రప్పించాలని వినూత్నంగా ఆలోచించిన ఓ  యజమాని ఏకంగా మొసలిని పెంపుడు జంతువులా పెంచుతున్నాడు. ఇక ఈ రెస్టారెంట్‌కు వచ్చిన యువత డిన్నర్‌ అనంతరం తెగ ముచ్చటపడుతూ మొసలితో సెల్పీలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లలైతే పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నట్లు ఆడుకుంటున్నారు. అయితే ఈ హోటల్‌ నిర్వాహుకులపై కొందరు జంతు ‍ప్రేమికులు మండిపడుతున్నారు. మొసలిని చూడాలంటే జూపార్క్‌లకు వెళ్లాలి. కానీ రెస్టారెంట్‌లో పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షూ @ 123 కోట్లు

ఉద్యోగార్థుల కోసం గూగుల్‌ అప్‌డేట్‌

పేదరికంపై పోరులో భారత్‌ భేష్‌: ట్రంప్‌

ఫేస్‌బుక్‌కు షాక్ ‌: ఇన్‌స్టాగ్రామ్‌ ​కో ఫౌండర్స్ గుడ్‌బై

అరుదైన గౌరవం.. అంతలోనే అపఖ్యాతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుండమ్మ కథ గుర్తొచ్చింది : అశ్వనీదత్‌ 

బై బై రాఘవ

అలియాస్‌ ప్రీతి

ఆట  మొదలు

ప్రయాణానికి సిద్ధం

మణి సార్‌ ఫామ్‌లో ఉండి తీశారు – ఏఆర్‌ రెహమాన్‌