చిలీ సింగర్‌ అర్ధ నగ్నంగా.......

15 Nov, 2019 19:27 IST|Sakshi

చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్‌ గాయనీ మాన్‌ లఫ్తార్టే గురువారం నాడు లాస్‌ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్‌ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్‌ కార్పెట్‌ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్‌ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. 

ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్‌ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. 

మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పియనెరా, అక్టోబర్‌ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్‌లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్‌ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. 

>
మరిన్ని వార్తలు