కారం పొడి చల్లుకున్న ఎంపీలు!

17 Nov, 2018 05:19 IST|Sakshi

కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ శుక్రవారం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. గురువారం రాత్రి అధ్యక్షుడు సిరిసేన అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోసారి విశ్వాస పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌ సమావేశం ప్రారంభం కాగా రాజపక్స మద్దతుదారులైన యూపీఎఫ్‌ఏ ఎంపీలు కొందరు స్పీకర్‌ కుర్చీని ఆక్రమించారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఫర్నిచర్‌ విరగ్గొట్టారు. పుస్తకాలను విసిరేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. దీంతో స్పీకర్‌ పోలీసులను పిలిపించారు. సభ్యులను సముదాయించేందుకు యత్నించిన పోలీసులపైకి కూడా వారు కారం చల్లారు. ఈ దాడిలో ప్రత్యర్థి పార్టీల సభ్యులు కొందరు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్‌..సభను సోమవారానికి వాయిదా వేస్తూ పోలీసు రక్షణ నడుమ బయటకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు