చైనాలోకి భారత దళాలు

28 Jun, 2017 02:26 IST|Sakshi
చైనాలోకి భారత దళాలు

చైనా ఆరోపణ
బీజింగ్‌: భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ చైనా మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. సైనికులు వెంటనే వెనక్కు వెళ్లాలంది. తాజా ఘర్షణాత్మక వాతావరణానికి చూపే పరిష్కారంపైనే భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్‌ యాత్రకు అనుమతించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చైనా పేర్కొంది. ప్రస్తుతానికి భద్రతా కారణాల వల్లనే మానస సరోవర్‌ యాత్రకు వచ్చిన భారతీయులను అనుమతించలేదని చైనా తెలిపింది.

‘మా ప్రాంత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ అంశంలో భారత్‌ కూడా చైనాతో కలిసి నడుస్తుందనీ, చైనా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయ సైనికులను వెంటనే వెనక్కు పిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాంగ్‌ చెప్పారు. న్యూఢిల్లీలోనూ, బీజింగ్‌లోనూ దౌత్యపరంగా తమ నిరసన, వైఖరిని భారత్‌కు తెలియజేశామని ఆయన వెల్లడించారు. ‘భారత యాత్రికులకు సౌకర్యాలు, భద్రత కల్పించడానికి చైనా ఇప్పటివరకు ఎంతో చేసింది. తాజాగా భారత దళాలు చైనా భూభాగంలోకి ప్రవేశించి, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. అయితే భద్రతా కారణాల వల్లనే ప్రస్తుతం భారతీయ యాత్రికులను చైనా మీదుగా వెళ్లనీయడం లేదు’ అని కాంగ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు