2020 నాటికి 44.50 లక్షల నర్సులు!

11 May, 2016 19:00 IST|Sakshi
2020 నాటికి 44.50 లక్షల నర్సులు!

బీజింగ్: రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా రోగుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. వీరికి మెరుగైన సేవలు అందించడంపై చైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా 2020 సంవత్సరానికిగానూ 44.50లక్షల నర్సులు ఉండాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే వెయ్యిమందికి గానూ 3.14(దాదాపు ముగ్గురు) నర్సులు ఉంటారని అంతర్జాతీయ నర్సెస్ డే(మే 12)ను పురస్కరించుకొని చైనా జాతీయ ఆరోగ్య కుటుంబ నియంత్రణ డిప్యుటీ కమిషనర్ క్సియావీ తెలిపారు.  ప్రస్తుతం వెయ్యిమందికి కేవలం 2.36(దాదాపు రెండు) మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. చైనాలో 2015 చివరికల్లా నర్సులుగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 32.40లక్షలుగా ఉంది. 2010-15వరకు నర్సులుగా నమోదైన వారి సంఖ్య 58 శాతం పెరిగింది.
 

మరిన్ని వార్తలు