బ్లాక్లిస్టులో 31.4 లక్షల కంపెనీలు

10 Oct, 2015 11:46 IST|Sakshi
బ్లాక్లిస్టులో 31.4 లక్షల కంపెనీలు

బీజింగ్ : పారదర్శకత లోపించిందని భావించిన చైనా ప్రభుత్వం 3.14 మిలియన్ల(31.4 లక్షలు) సంస్థలు, కంపెనీలను బ్లాక్లిస్ట్లో చేర్చింది. ఆయా సంస్థలు ప్రభుత్వానికి అందించిన వివరాలు, నిర్వహణ లోపాలు, పన్నుల ఎగవేత, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఇటీవలే వెల్లడించారు.

బ్లాక్లిస్ట్ కంపెనీల వివరాలను నేషనల్ ఎంటర్ప్రైజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్ అనే వెబ్సైట్లో  పొందుపరిచినట్లు పారిశ్రామిక, వాణిజ్యశాఖల డిప్యూటీ చీఫ్ లీయు యుటింగ్ పేర్కొన్నారు. వెబ్సైట్ సిస్టమ్ ఆ కంపెనీల రిజిస్ట్రేషన్, అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలు, ప్రభుత్వ పన్నులు, జరిమానాలు లాంటి పూర్తివివరాలను అందిస్తుందని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు