ఆ వార్త అవాస్తవం: చైనా

23 Jun, 2020 20:02 IST|Sakshi

బీజింగ్‌: భారత సరిహద్దులోని గల్వాన్ లోయలో, భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులు 43 మందికి పైగా చనిపోయారన్న వార్తను చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జోహో లిజ్జాఆన్‌ మంగళవారం ఖండించారు. అది అసత్య ప్రచారమని కొట్టిపడేశారు. సరిహద్దు విషయాలను పరిష్కరించుకునేందుకు చైనా-ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. (భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?)

గత సోమవారం జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా- ఇండియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలలో 43 మంది వరకు చైనా సైనికులు చనిపోయారనే వార్తను లిజియాన్‌ ఖండించారు. భారత్‌కు చెందిన 20 మంది సైనికులు ఈ ఘర్షణలో చనిపోయారు. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు సోమవారం ఇరుదేశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ల మధ్య చర్చలు జరిగాయి. అంతకుముందు జూన్‌6వ తేదీన కూడా లెఫ్టెనెంట్‌ జనరల్స్‌ మధ్య చర్చలు జరిగినప్పటికి జూన్‌ 15వ తేదీన ఇరుదేశాల సరిహద్దు ఒప్పందాలను అతిక్రమించి చైనా భారత్‌పై దాడి చేసింది. 

(చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి!)

మరిన్ని వార్తలు