డొక్లామ్‌లో మళ్లీ రోడ్డేస్తున్న చైనా..!

6 Oct, 2017 00:27 IST|Sakshi

న్యూఢిల్లీ : డొక్లామ్‌లో పీఠభూమి వివాదానికి మళ్లీ తెర లేచాలా ఉంది. చికెన్‌ నెక్‌ ప్రాంతంలో రోడ్డు వేసే ప్రక్రియను నిలిపేసి, సైన్యాన్ని వెనక్కు పిలిచిన చైనా.. గత వివాదాస్పద ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో మళ్లీ రోడ్డు వేయడం ప్రారంభించింది. దాదాపు 500 మంది చైనా జవాన్లు రోడ్డు నిర్మిస్తున్న కార్మికులకు రక్షణగా ఉంటున్నట్లు తెలిసింది.

చైనా రోడ్డు నిర్మిస్తున్న ఈ ప్రాంతం నుంచి యాటుంగ్‌ పట్టణానికి కేవలం 20 కిలోమీటర్లే. ప్రస్తుతం చైనా రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతం అతి శీతలంగా ఉంటుంది. చలికాలంలో మంచు దుప్పటిని పరుచుకుంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. దీంతో జవాన్లు, కూలీలు యాటుంగ్‌లో బస చేస్తూ రోడ్డు నిర్మాణ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు భారతీయ ఆర్మీ అధికారి తెలిపారు. పట్టణం చేరువలో ఉండటంతో అవసరమైతే మరింత మంది సైనికులను మొహరించే వెసులుబాటు చైనాకు ఉందని ఆయన చెప్పారు.   

మరిన్ని వార్తలు