కల కోసం రూ. 2 కోట్లు వెచ్చించాడు

30 Oct, 2018 20:00 IST|Sakshi

బీజింగ్‌ : చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరం ఎన్నో కలలు కంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ కలల్ని నిజం చేసుకుంటారు. వీరి కోవలోకే వస్తాడు చైనాకు చెందిన ఓ రైతు. జూ యూ అనే వ్యక్తికి బాల్యం నుంచే  సొంత కారు, బైక్‌ లాగానే సొంతంగా విమానం ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉండేది. ఈ క్రమంలో తన నలభయ్యో ఏట విమానాన్ని తయారు చేసే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి.. రెండు కోట్ల రూపాయలు వెచ్చించి తన కలకు ప్రాణం పోశాడు.

124 అడుగుల పొడవు.. 118 అడుగుల వెడల్పు.. 40 అడుగుల ఎత్తుతో ఎయిర్‌బస్‌ ఏ320​కి ప్రతీకగా రూపొందించిన ఈ విమానం వచ్చే ఏడాది మే వరకూ పూర్తి కానున్నట్లు తెలిసింది. అనంతరం ఈ విమానంలో రెస్టారెంట్‌ లేదా హోటల్‌ ప్రారంభించాలనుకుంటున్నట్లు జూ యూ తెలిపాడు. తన  కల గురించి తెలిసిన ఐదుగురు స్నేహితులు ఈ విమానం రూపకల్పనలో తనకి తోడుగా నిలిచారని తెలిపాడు జూ యూ.

మరిన్ని వార్తలు