అక్కడికెలా వెళతారు..?

15 Feb, 2018 16:39 IST|Sakshi
మోదీ అరుణాచల్‌ టూర్‌పై చైనా అభ్యంతరం

బీజింగ్‌ : ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై డ్రాగన్‌ తన వక్రబుద్ధి చాటుకుంది. మోదీ పర్యటించిన ప్రాంతం దక్షిణ టిబెట్‌లో భాగమంటూ మండిపడింది. భారత్‌ తీరుపై దౌత్యపరమైన నిరసన చేపడతామని పేర్కొంది. చైనా-భారత్‌ సరిహద్దు వ్యవహారంలో చైనా వైఖరి సుస్పష్టమని, దీనిలో ఎలాంటి మార్పు లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్‌ షాంగ్‌ అన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ గుర్తించలేదని..వివాదాస్పద ప్రాంతంలో భారత నేత పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని షాంగ్‌ చెప్పినట్టు చైనా అధికార వార్తాసంస్థ తెలిపింది. సరిహద్దు వివాదాలను సంప్రదింపులు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సరిహద్దు సమస్య ఉత్పన్నమయ్యేలా ఎలాంటి వివాదాలకు భారత్‌ తావివ్వరాదని చైనా కోరుతోందన్నారు. 

>
మరిన్ని వార్తలు