చైనా తక్కువ చేసి చూపింది: అమెరికా

5 May, 2020 05:10 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ తీవ్రతను తక్కువగా చేసి చూపడం ద్వారా చైనా అత్యవసరమైన వైద్య సామగ్రిని అక్రమంగా నిల్వ చేసుకుందని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యురిటీ (డీహెచ్‌ఎస్‌)భావిస్తోంది. చైనా నేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యాధి తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెట్టారని, ఇది ఈ ఏడాది జనవరి తొలినాళ్లలో జరిగిందని డీహెచ్‌ఎస్‌ ఓ నిఘా నివేదికను సిద్ధం చేసిందని అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ తెలిపింది. వైరస్‌ ప్రభావాన్ని తక్కువ చేసి చూపిన చైనా ఆ సమయంలో వైద్య సామాగ్రి దిగుమతులు పెంచి, ఎగుమతులు తగ్గించిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది. వైరస్‌ సాంక్రమిక లక్షణం ఉందని జనవరి ఆఖరు వరకూ చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలపలేదని నివేదికలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు