షిప్‌ నుంచి రాకెట్‌ ప్రయోగించిన చైనా

5 Jun, 2019 14:54 IST|Sakshi

బీజింగ్‌ : అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న ఆ దిశలో తీవ్రమైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సముద్రంలోని షిప్‌పై నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని చైనా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. ఈ విధంగా రాకెట్‌ను ప్రయోగించడం చైనాకు ఇదే తొలిసారి. ఎల్లో సముద్రం నుంచి ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 11 రాకెట్‌ 7 ఉప్రగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. వాటిలో ఒక శాటిలైట్‌ తుపాన్ల పరిశీలనకు సంబంధించింది. మరో రెండు కమ్యూనికేషన్‌ శాటిలైట్‌లు బీజింగ్‌లోని ఓ టెక్నాలజీ కంపెనీకి చెందినవి. ఇటీవలి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న చైనా.. అందుకోసం భారీగా నిధులను కూడా ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా 2030 నాటికి అంతరిక్షరంగంలో అమెరికాను అందుకోవాలని భావిస్తోంది. 

మరిన్ని వార్తలు