అధ్యక్షుడు 'రాజీనామా' అంటూ కలకలం..

8 Dec, 2015 08:40 IST|Sakshi

బీజింగ్: ఓ చైనా వార్త సంస్థ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ 'రాజీనామా' అంటూ  పొరపాటున ఓ వార్త రాయడం కలకలం రేపింది. ఈ తప్పిదానికి బాధ్యులైన నలుగురు ఉద్యోగులను ఆ వార్త సంస్థ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.

గతవారం జొహాన్నెస్బర్గ్లో జరిగిన చైనా-ఆఫ్రికా సదస్సులో జీ జిన్పింగ్ పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడి ప్రసంగాన్ని కవర్ చేస్తూ చైనా న్యూస్ సర్వీస్ ఓ కథనం రాసింది. అయితే చైనీస్ భాషలో అధ్యక్షుడి 'ప్రసంగం' అనే పదాన్ని పొరపాటుగా 'రాజీనామా' అంటూ టైప్ చేశారు. రెండు చైనీస్ క్యారెక్టర్లు తప్పుదొర్లడంతో ప్రసంగం అనే పదం అర్థం మారిపోయి రాజీనామా అయ్యింది. గత శుక్రవారం ఈ తప్పిదం చోటు చేసుకుంది. ఆ వార్త సంస్థ ఈ తప్పిదాన్ని సరిచేసినా కొన్ని వెబ్సైట్లు ఆ వార్తను యథాతథంగా ప్రచురించడంతో దుమారం చెలరేగింది.

మరిన్ని వార్తలు