బంగ్లాదేశ్‌కు చైనా ఆఫర్‌!

21 Jun, 2020 04:55 IST|Sakshi

8,256 బంగ్లాదేశ్‌ ఉత్పత్తులకు చైనాలో పన్ను మినహాయింపు

ఢాకా: భారత్‌ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ను మచ్చిక చేసుకుందుకు చైనా తంటాలు పడుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో 97 శాతం ఉత్పత్తులకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఇటీవల సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన 8,256 ఉత్పత్తులు చైనాలో పన్ను మినహాయింపు కిందకు రానున్నాయి. ఆసియా–పసిఫిక్‌ వాణిజ్య ఒప్పందంకింద 3,095 బంగ్లా ఉత్పత్తులకు చైనాలో పన్ను మినహాయింపు ఉంది. జూలై 1 నుంచి ఈ సంఖ్య 8,256కు చేరనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఇప్పటికే దెబ్బతిన్న బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థ చైనా ఇచ్చిన పన్ను మినహాయింపుతో కొంత పుంజుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు