విదేశాల్లోనూ టీకాను పరీక్షిస్తాం: చైనా 

1 Apr, 2020 06:49 IST|Sakshi

బీజింగ్‌: కరోనాను నిర్మూలించే టీకాను రూపొందించే పనిలో ఉన్న చైనా.. ఆ వ్యాక్సిన్‌ను కరోనా తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లోనూ పరీక్షించాలనుకుంటోంది. వుహాన్‌లో నిర్వహిస్తున్న పరీక్షల్లో ఆ టీకా సురక్షితమేనని, ప్రభావవంతమేనని తేలితే విదేశాల్లోనూ ట్రయల్స్‌ నిర్వహించే అవకాశముందని చైనీస్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చెన్‌ వీ వెల్లడించారు. టీకా ప్రాథమిక స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ మార్చి 16న వుహాన్‌లో ప్రారంభమయ్యాయన్నారు. చైనాలోని విదేశీయులపై టీకాను పరీక్షిస్తామన్నారు. చాలా దేశాలు తాము పరీక్షిస్తున్న టీకాపై ఆసక్తి చూపాయని ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ రూపకల్పనలో విదేశీ సంస్థలకు సహకరించేందుకు  సిద్ధంగా ఉన్నామన్నారు. (కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధన ముమ్మరం)
చదవండి: మర్కజ్‌ @1,030

>
మరిన్ని వార్తలు