ఆర్మ్‌డ్‌ డ్రోన్లా.. మాకు భయం లేదు : చైనా

31 Oct, 2017 08:50 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఆయుధ, రక్షణ ఒప్పందాల విషయంలో భారత్‌-అమెరికా రోజురోజుకూ దగ్గరవుతున్న సమయంలో చైనా తొలిసారి స్పందించింది. ఆర్మ్‌డ్‌ డ్రోన్లు, పహారా డ్రోన్లు, ఇతర అత్యున్నత సాంకేతిక మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను భారత్‌కు విక్రయించేందుకు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ సానుకూల సంకేతాలు పంపిన నేపథ్యంలో చైనా ప్రతిస్పందించింది.  భారత్‌-అమెరికా రక్షణ సంబంధాలు అత్యంత ఉల్లాసపూరిత వాతావరణంలో కొనసాగుతున్నాయని, వాటివల్ల మాకు వచ్చిన భయం కొత్తగా ఏమీలేదని అమెరికాలోని చైనా రాయబారి క్యూ టినాకై తెలిపారు. భారత్‌-అమెరికా స్నేహ, రక్షణ బంధాల వల్ల ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని కొందరు అపోహ పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా-చైనా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని.. వాటిని ఎవరూ చెడగొట్టలేరని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా జపాన్‌ తాజాగా చేసిన వ్యూహాత్మక చర్చలపైన ఆయన స్పందించారు. జపాన్‌, బారత్‌, ఆస్ట్రేలియా, అమెరికాలు ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌కు ప్రత్యామ్నాయంపై చేస్తున్న ప్రయత్నాలపై స్పందించేదుకు ఆయన నిరాకరించారు. అయితే.. భారత్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేయడంపై స్పందించారు. ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో భారత్‌ను బలోపేతం చేయడం చేయడం ద్వారా చైనాకు చెక్‌ పెట్టవచ్చని.. అందుకోసమే అమెరికా, భారత్‌కు ఆయుధాలను విక్రయిస్తోందన్న వాదనలను సమర్థిస్తూనే.. ఇటువంటి వాటికి చైనా భయపడదు అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు