ఉత్తర కొరియాకు వైద్య బృందాన్ని పంపిన చైనా

25 Apr, 2020 10:22 IST|Sakshi

బీజింగ్‌ : ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యంపై వదంతుల వస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. ఆయన ఆరోగ్యం విషమించిందని వార్తలు వస్తున్న వేళ డ్రాగాన్‌ దేశం ఓ వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన లైనిస్‌ డిపార్టమెంట్‌ నేతృత్వంలో ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆ దేశానికి పంపినట్ల ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. అయితే కిమ్‌ ఆరోగ్యంపై మాత్రం చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా కిమ్‌  ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆ దేశం ఎలాంటి ప్రకటక చేయలేదు. తాజాగా అధినేత ఆరోగ్యంపై దక్షిణ కొరియా స్పందించింది. కిమ్‌కు ఎలాంటి సమస్య లేకపోవచ్చిని ఆయనపై వస్తున్న వదంతులను కొట్టిపారేసింది. (విషమం‍గా కిమ్‌ జోంగ్ ఆరోగ్యం..!)

రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కిమ్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో చైనా వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా లాంటి విపత్తులో కూడా చైనా దేశం ఉత్తర కొరియాకు వైద్యులను పంపడంతో నిజంగానే కిమ్‌ ఆరోగ్యం క్షిణించి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం ఏమీ లేనప్పుడు, అంతా బాగానే ఉన్నప్పుడు... ఉత్తర కొరియా ఎందుకు స్పందించటట్లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. కిమ్ ఎందుకు కనిపించట్లేదన్నది తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు