నయా చాలెంజ్‌ : మీ సంపదేంటో చూపించగలరా..?

25 Oct, 2018 18:38 IST|Sakshi

బీజింగ్‌ : సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక చాలెంజ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. రెండు నెలల క్రితం వరకూ కూడా ‘కీకీ చాలెంజ్‌’ హల్‌చల్‌ చేసింది. పోలీసుల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. సెలబ్రిటీల నుంచి సాధరణ పౌరుల వరకూ.. వయసుతో సంబంధం లేకుండా కీకీ డ్యాన్స్‌ చేసి వీడియోలను ఇంటర్నెట్‌లో అపలోడ్‌ చేశారు. ఇప్పుడు కొత్త తరహా చాలెంజ్‌ ఒకటి చైనాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఆ చాలెంజ్‌ విశేషాలు చూడండి.

‘వెల్త్‌ ఫ్లాంటింగ్‌ చాలెంజ్‌’ పేరుతో వైరలవుతోన్న ఈ చాలెంజ్‌ని సెలబ్రిటీల నుంచి ప్రభుత్వ అధికారులు కూడా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఈ చాలెంజ్‌లో ఏం చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తున్నారా.. చేప్తాం. ఈ వెల్త్‌ ఫ్లాంటింగ్‌ చాలెంజ్‌ తీసుకున్న వ్యక్తులు తమ నిజ జీవితంలో వేటినైయితే అత్యంత భద్రంగా చూసుకుంటారో.. వేటిని ఎక్కువగా ప్రేమిస్తారో.. ఇంకో రకంగా చెప్పాలంటే తమ సంపదగా భావించే వాటిని రోడ్డు మీద పెట్టాలి, పడేయ్యాలి.

అంటే క్రెడిట్‌ కార్డ్స్‌, డబ్బు, జ్యూవెలరి, డిజైనర్‌ బట్టలు, చెప్పులు, బ్యాగ్‌లు, వృత్తికి సంబంధించినవి, వస్తువులు, జంతువులు, మనషులతో సహా. వాటిని రోడ్డు మీద పడేయాలి. తర్వాత కార్‌ నుంచి బయటకు వచ్చి పడేసిన వాటి మధ్య పడుకోని ఫోటో దిగాలి. ఏదో ఫోటోషూట్‌కి ఫోజ్‌ ఇస్తున్నట్లు కాకుండా.. స్పృహతప్పి కింద పడిపోయినట్లు పేవ్‌మెంట్‌ వైపుగా ముఖం పెట్టి పడిపోవాలి. తర్వాత ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలి.

ప్రస్తుతం చైనాలో ట్రెండ్‌ అవుతోన్న ఈ చాలెంజ్‌లో ఇప్పటికే పలువురు తమ విలువైన సంపదను ప్రంపచానికి పరిచయం చేశారు. కొందరు ఖరీదైన బ్యాగ్‌లు, మేకప్‌ సామాగ్రిని చూపించగా.. మరి కొందరు ఫైల్లను.. మెకానిక్‌ వస్తువులను.. పరిచయం చేశారు.

It's not how you fall.... It's how you get up! #fallingstarschallenge #fallingstars2018 #fallingstars #fall #bodifitbootcamp #bootcampsemarang #didiesantoso #bootcamp #streetworkout #calisthenics

A post shared by didiesantoso (@didiesantoso) on

మరిన్ని వార్తలు