తైవాన్‌ కేంద్రంగా చైనా భారీ స్కెచ్‌..!

18 May, 2018 16:29 IST|Sakshi

బీజింగ్‌ : హిందు మహా సముద్రంపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నాలను తీవ్రతరం చేస్తోందని అందులో భాగంగా తైవాన్‌ కేంద్రంగా పథక రచన చేస్తోందని యూఎస్‌ చట్టసభ ప్రతినిధి రిచర్డ్‌ డి ఫిషర్‌ హెచ్చరించారు. చైనా చాలా కాలం నుంచి భారత్‌, జపాన్‌ల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దక్షిణ చైనా, హిందు మహాసముద్రాల మీద అధిపత్యం సాధించడం ద్వారా భారత్‌కు మిత్రదేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను దెబ్బతీయాలనేది చైనా వ్యుహం.

రిచర్డ్‌ మాట్లాడుతూ.. ‘తైవాన్‌లో అణుకేంద్రాలతోపాటు, భారీగా మిలటరీ స్థావరాలు ఏర్పరుచుకోవడం ద్వారా క్రమంగా హిందు మహాసముద్రంపై, దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యాన్ని పెంచుకోవచ్చని చైనా భావిస్తుంది. ఆర్థికంగా స్థిరపడుతున్న చైనా, అదే విధంగా సైనిక శక్తిని పెంచుకుంటుంది. దీని ద్వారా భారత్‌, జపాన్‌ల మధ్య సంబంధాలను దెబ్బతీయాలని చూస్తోంది. భారత్‌ పొరుగు దేశాలను తన అదుపులోకి తెచ్చుకోవడానికి వాటికి భారీగా ఆర్థిక సాయం చేయబోతోంది’ అన్నరు. అయా దేశాల్లో కూడా సైనిక బలాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని జిబూటీలో సైనిక స్థావరాన్ని ఏర్పరుచుకున్న చైనా ఆ సరిహద్దుల్లో అమెరికా సైనిక జోక్యం చేసుకోకుండా చర్యలు చేపట్టవచ్చన్నారు. ఇప్పటికే శ్రీలంకతో సత్సబంధాలు కొనసాగిస్తున్న చైనా .. ప్రస్తుతం వనౌతు, పాకిస్తాన్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలతో కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే తైవాన్‌ను తన సైనిక, అణు స్థావరంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా చైనా 2025 వరకల్లా ఆ పని పూర్తి చేస్తుందని రిచర్డ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు