ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం

22 Jun, 2020 17:55 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బీజింగ్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాలకు దిగుతున్నారు. కరోనా వైరస్‌ విషయంలో ఇప్పటికే చైనాపై తీవ్ర ఆరోపణలు చేసిన ట్రంప్‌.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చైనాను ఉద్దేశిస్తూ కరోనా వైరస్‌కు కుంగ్ ఫ్లూ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కోవిడ్‌కు 20 రకాల కొత్త పేర్లు పెట్టామని, దానిని వూహాన్‌ వైరస్‌ అంటూ నామకరణం చేసింది కూడా తామేనంటూ రెచ్చగొట్టే రీతిలో ప్రకటనలు చేశారు. ఇటీవల ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన మొదటి ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. (వారి బెదిరింపులకు భయపడను: ట్రంప్‌)

దీనిపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంగ్ ఫ్లూ అనే వ్యాఖ్యలను ట్రంప్‌ వెనక్కి తీసుకోవాలని లేకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామలు ఎదుర్కొక తప్పదని డ్రాగన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన కరోనా వైరస్‌ను తమ కుట్రగా అమెరికా భావించడం సరైనది కాదంటూ పేర్కొంది. చైనాపై లేనిపోని విమర్శలు చేసి అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందాలని ట్రంప్‌ భావిస్తున్నారంటూ మండిపడింది. కాగా చైనాలో కుంగ్ ఫూ అనే మార్షల్ ఆర్ట్స్ ఎంతో ప్రత్యేకమైనదన్న విషయం తెలిసిందే.  (భారత్, చైనాలతో మాట్లాడుతున్నాం: ట్రంప్‌)

మరిన్ని వార్తలు