10 ఏళ్ల గ్యాప్‌తో కవలల జన్మ

20 Jun, 2020 14:59 IST|Sakshi

బీజింగ్‌ : మామూలుగా కవలలు‌ ఒకే సారి పుట్టడమో.. లేదా కొద్ది రోజులు గ్యాపు తీసుకుని పుట్టడమో జరుగుతుంది. కానీ, చైనాకు చెందిన ఓ మహిళ మాత్రం 10 సంవత్సరాల గ్యాప్‌తో కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన హ్యూబేలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. హ్యూబేకు చెందిన వాంగ్‌ అనే మహిళ 2009లో ఐవీఎఫ్‌ పద్దతి ద్వారా గర్భం దాల్చింది. 2010 జూన్‌లో ఆమె లూలూ అనే శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని అండాలను భవిష్యత్తు అవసరాల నిమిత్తం వైద్యులు అలానే ఉంచేశారు. అయితే పదేళ్ల తర్వాత వాంగ్‌ మళ్లీ తల్లి కావాలనుకుంది. తనకు ఐవీఎఫ్‌ చేసిన వైద్యుడిని సంప్రదించింది. అతడు మళ్లీ ఆమెకు ఐవీఎఫ్‌ నిర్వహించాడు. దీంతో ఆమె జూన్‌ 16న టాంగ్‌టాంగ్‌ అనే శిశువుకు జన్మనిచ్చింది. టాంగ్‌టాంగ్‌ అచ్చం లూలూ లానే అంతే బరువుతో పదేళ్ల తర్వాత ఒకే నెలలో జన్మించాడు.

మరిన్ని వార్తలు