చైనాపై దుమ్మెత్తిపోసిన ట్రంప్

25 Aug, 2016 14:00 IST|Sakshi
చైనాపై దుమ్మెత్తిపోసిన ట్రంప్

వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ దుమ్మెత్తిపోశారు. చైనా ఓ పనికిరాని నిందలు వేసే దేశం అని, డబ్బు విషయంలో మోసాలకు పాల్పడే దేశం అని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే ఏయే దేశం వాణిజ్యపరమైన ఒప్పందాలను ఉల్లంఘిస్తుందో గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. అమెరికా కార్మికులకు ఇబ్బందులు కలిగించే ఏ దేశమైనా తాము సహించబోమని అన్నారు.

చైనాకు తమ దేశ నాయకత్వంపైన గౌరవం లేదని.. అయితే, ఈ విషయంలో చైనాను తప్పుబట్టలేమని, తిరిగి నాయకత్వం అంటే గౌరవం పొందే స్ధాయిని తిరిగి నిలబెడతామని చెప్పారు. ఇప్పటికంటే ఎక్కువగా అమెరికన్లు గౌరవం పొందేలా చేస్తానని చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా భారీ మొత్తంలో సైన్యాన్ని నిలుపుతోందని, అందుకు తాము అనుమతించబోమని చెప్పారు. చైనాకంటే అమెరికా వాణిజ్యపరంగా, సైనిక పరంగా ఏ విషయపరంగా చూసుకున్నా చాలా శక్తిమంతమైన దేశమని అన్నారు.

మరిన్ని వార్తలు