సోవియట్‌లా.. చైనా కూలిపోనుందా?!

15 Nov, 2017 18:20 IST|Sakshi

కమ్యూనిస్ట్‌ దేశం చైనాలో అవినీతి భూతం విశృంఖలంగా ఉందా? దేశాన్ని పతనం చేసే స్థాయికి అవినీతి పెరిగిందా? సోవియట్‌ యూనియన్‌లా చైనా ఏదో ఒకరోజు కుప్పకూలిపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా ఉన్నతాధికారులే దీనిని బలపర్చడం విశేషం.

చైనా.. కమ్యూనిస్ట్‌ ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి. సోవియట్‌ యూనియన్‌ తరువాత అంతటి స్థాయికి ఎదిగిన దేశం. అవినీతి భూతం చైనా అర్థిక పునాదులను కూలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చైనా బయటి దేశాలతో చేసే యుద్ధం కన్నా.. దేశంలోని పెరిగిన అవినీతితో యుద్ధం చేయాలని.. లేకపోతే అత్యంత వేగంగా సోవియట్‌ యూనియన్‌ తరహాలో చైనా విచ్ఛిన్నం అవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 25 పొలిట్‌ బ్యూరోలో కీలక నేతగా ఎదిగిన యాంగ్‌ క్సియాడు అవినీతిపై స్పష్టమైన ప్రకటన చేశారు.

భారీగా అవినీతి
చైనాలో గత ప్రభుత్వాలు దేశంలో అవినీతిని ప్రోత్సహించాయి. అవినీతి పరులు పార్టీని శాసించే స్థాయికి నేడు చేరుకున్నారు.. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని యాంగ్‌ చెప్పారు. అవినీతి పరులు బలపేతం కావడంతో పార్టీ బలహీన పడే స్థాయికి చేరిందని కూడా ఆయన స్పష్టం చేశారు.

విచ్చిన్నం దిశగా దేశం
దేశంలో విశృంఖలంగా పెరిగిన అవినీతిని కట్టడి చేయాలని ఆయన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరారు. అవినీతిని కట్టడి చేయలేకపోతే.. చైనా మరో సోవియట్‌ యూనియన్‌ అవుతుందని యాంగ్‌ హెచ్చరించారు.

పట్టుకోల్పోతున్న జిన్‌పింగ్‌
అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇతర కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే పార్టీలో పట్టు కోల్పోతున్నారని.. యాంగ్‌ ప్రకటించారు. పార్టీపై కీలక నేతలు పట్టుకోల్పోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాంగ్‌ పేర్కొన్నారు.

ప్రమాద ఘంటికలే!
జిన్‌పింగ్‌ కుడిభుజం, అధికార పార్టీలో అత్యంత సీనియర్‌ పొలిటీషియన్‌ అయిన వాంగ్‌ క్వుషాన్‌, తాజాగా యాంటి కరప్షన్‌ చీఫ్‌ జాహో లెజీ కూడా చైనా ప్రమాదర స్థితిలో ఉందని చెబుతున్నారు. భారీగా పెరిగిన అవినీతి వల్ల చైనా ఎప్పుడైనా కూలిపోవచ్చనే సందేహాలు వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు