గుడ్‌న్యూస్‌ : వ్యాక్సిన్‌ దిశగా కీలక ముందడుగు

8 May, 2020 16:45 IST|Sakshi

జోరుగా క్లినికల్‌ ట్రయల్స్‌

బీజింగ్‌ : కరోనా మహమ్మారి చికిత్సలో కీలక ముందడుగు వేశామని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోవిడ్‌-19కు దేశంలో తొలి వ్యాక్సిన్‌ను కోతులపై విజయవంతంగా పరీక్షించామని డ్రాగన్‌ సైంటిస్టులు తెలిపారు. బీజింగ్‌కు చెందిన షినోవాక్‌ బయోటెక్‌ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ వైరస్‌ నుంచి కోతిని కాపాడటంలో విజయవంతమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రయోగం కోసం కోతులకు టీకాను ఇచ్చిన శాస్త్రవేత్తలు మూడు వారాల తర్వాత కోవిడ్‌-19 వైరస్‌కు దారితీసే సార్స్‌-కోవ్‌-2ను వాటిలో ప్రవేశపెట్టారు.

అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కోతుల్లో వ్యాధినిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్‌ ప్రేరేపించి యాంటీబాడీలను విడుదల చేసిందని ఈ యాంటీబాడీలు సాధారణ వైరస్‌లపైనా దాడిచేస్తాయని తేలిందని సైన్స్‌ మ్యాగజైన్‌ నివేదిక స్పష్టం చేసింది. పికోవాక్‌ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్‌ అధిక డోస్‌ను ఇచ్చిన కోతుల ఊపరితిత్తుల్లో వైరస్‌ లేదని, వ్యాక్సిన్‌ తీసుకోని కోతులు వైరస్‌తో పోరాడలేక తీవ్ర న్యుమోనియోకు గురయ్యాయని వెల్లడైందని పరిశోధకులు గుర్తించారు. కాగా ఏప్రిల్‌ ద్వితీయార్ధం నుంచే చైనా ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటలీ, ఇజ్రాయిల్‌లు ఇప్పటికే కోవిడ్‌-19 టీకాలను అభివృద్ధి చేయడంలో విజయం సాధించామని ప్రకటించాయి.

చదవండి : కరోనాపై నిర్లక్ష్యం తగదు: జిన్‌పింగ్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు