చైనా కాన్సులేట్‌లో ప‌త్రాల కాల్చివేత‌

22 Jul, 2020 10:21 IST|Sakshi

హ్యూస్ట‌న్: అగ్ర‌రాజ్యం అమెరికా, డ్రాగ‌న్ దేశం చైనా మ‌ధ్య వాణిజ్య‌, దౌత్య వివాదం ముదురుతున్న నేప‌థ్యంలో అనూహ్య‌‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అమెరికాలోని హ్యూస్ట‌న్‌లో చైనా కాన్సులేట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంలో నుంచి మంట‌లు, పొగ‌లు క‌నిపించాయి. దీంతో అగ్ని ప్ర‌మాదం జ‌రుగుతోంద‌ని భావించిన స్థానికులు రాత్రి 8 గంట‌ల‌కు(అక్క‌డి కాల‌మానం ప్ర‌కారం) పోలీసుల‌కు, అంబులెన్స్‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించారు.

వెంట‌నే వారు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకోగా అక్క‌డి దృశ్యాన్ని చూసి నివ్వెర పోయారు. కాన్సులేట్ కార్యాల‌య‌ అధికారులు కావాల‌నే కొన్ని ప‌త్రాల‌ను త‌గులబెడుతున్న‌ట్లు క‌నిపించింది. ఈమేర‌కు స్థానిక మీడియా కొన్ని వీడియో క్లిప్పింగ్‌ల‌ను ప్ర‌సారం చేసింది. అందులో కొంద‌రు వ్య‌క్తులు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌త్రాల‌ను త‌గల‌బెట్ట‌డం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే వారు ఏ పత్రాల‌ను త‌గుల‌బెట్టారు? ఎందుకు వాటిని బూడిద చేశార‌నే విష‌యాలు తెలియాల్సి ఉంది. (చైనాకు షాక్‌: భారత్‌-అమెరికా యుద్ధ విన్యాసాలు)

చ‌ద‌వండి:  హ్యాండ్సప్‌.. డోంట్‌ షూట్‌!

మరిన్ని వార్తలు