డ్రైవర్ లెస్ టెక్నాలజీ రేసులో చైనా!

25 Apr, 2016 13:40 IST|Sakshi
డ్రైవర్ లెస్ టెక్నాలజీ రేసులో చైనా!

బీజింగ్ః భారీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ గూగుల్ కు పోటీగా ప్రముఖ చైనా సంస్థ స్వయం చోదిత కార్లను సిద్ధం చేస్తోంది. చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థతో కలసి ఇంటర్నెట్ దిగ్గజం బైడు ఈ  డ్రైవర్ లెస్ కార్ల తయారీ చేపట్టనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, యంత్ర మేథస్సుల కలయికతో ఈ స్వయం చోదిత కార్లను తయారు చేయనున్నట్లు చైనా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సమావేశంలో బైడు సీనియర్ ఉపాధ్యక్షులు వాంగ్ జిన్ తెలిపారు.

చైనా తయారీదారులు, ఇంటర్నెట్ దిగ్గజాలు డ్రైవర్ లెస్ టెక్నాలజీవైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికా సంస్థలకు దీటుగా డ్రైవర్ లెస్ కార్ల తయారీకోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే మార్కెట్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికే గూగుల్ స్వయం చోదిత కారును అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న విషయం తెలిసిందే.  గత ఆరేళ్ళుగా బిఎమ్ డబ్ల్యూ, వోల్వో, టయోటాల సహకారంతో గూగుల్  అటానమస్ వాహనాల తయారీ చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం'బైడు' తయారీదారులు 'చంగన్' తో కలసి అదే రేసులో ఎంటరయ్యే  ప్రయత్నం చేస్తోంది.

దేశ మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి వాహనాల టెస్ట్ లో రాజధానికి నైరుతిలోని పర్వతశ్రేణుల్లో 2,000 కిలోమీటర్ల అత్యధిక దూరం ప్రయాణించిన రెండు స్వీయ డ్రైవింగ్ ఛంగన్ కార్లు ఇప్పటికే  బీజింగ్ ఆటో షో లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు మరో చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం 'లీ ఎకో' కూడ అటానమస్ టెక్నాలజీలోకి ప్రవేశించి ఓ ఎలక్ట్రానిక్ కారును బీజింగ్ లో ఆవిష్కరించింది. చైనాలో  'బైడు' సంస్థ  మొదటిసారి స్థానికంగా రూపొందించిన  డ్రైవర్ లెస్ వాహనం గతేడాది చివరల్లో బీజింగ్ లోని వీధుల్లో 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ స్థానికులను ఆకట్టుకుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో చైనా ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ స్థానిక వినియోగదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి, కీలక మార్కెట్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు