ఓ మైగాడ్.. అతడు బతికాడు!

17 Jun, 2016 14:23 IST|Sakshi
ఓ మైగాడ్.. అతడు బతికాడు!

బీజింగ్: దురదృష్టం వెంటాడితే కాలు జారినా కాటికి పోతాం. అదృష్టముంటే ఆకాశం నుంచి పడినా ఆయువు తీరదు. చైనాకు చెందిన 46 వ్యక్తి మృత్యుముఖంలోంచి బయటపడ్డాడు. 1.5 మీటర్ల ఇనుప ఊచ దేహంలోకి దూసుకుపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు.

షాన్ డాంగ్ ప్రావిన్స్ లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న జాంగ్ అనే ఇంటి పేరు కలిగిన వ్యక్తి పనిచేస్తూ 5 మీటర్ల ఎత్తు నుంచి ఇనుప ఊచలపై పడిపోయాడు. ఈనెల 14న  ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఇనుప ఊచలను కత్తిరించి అతడిని జినాన్ లోని షాన్ డాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు.

అయితే అతడి శరీరంలోకి చొచ్చుకుపోయిన 1.5 మీటర్ల ఇనుప రాడ్ ను డాక్టర్లు ఎంతో శ్రమించి బయటకు తీశారు. 7 గంటలకు పైగా శ్రమించి అతడి ప్రాణాలను నిలిపారు. కపాలం, శ్వాసనాళం, గుండె, గళధమని, కాలేయం పక్కనుంచి ఇనుపరాడ్ చొచ్చుకుపోయినట్టు ఎక్స్ రేలో కనబడింది. ప్రధాన అవయవాలకు ఏమాత్రం గాయం అయినా అతడి ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం  అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు వారాల పాటు అతడి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు