చైనా ఫోన్లతో జరభద్రం

10 Oct, 2017 16:23 IST|Sakshi

ఎక్కువ సమయం వాడితే ప్రమాదమే

గేమ్స్‌ ఆడితే.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

రెటీనా సమస్యలకు అవకాశం

చైనా ఫోన్లు వాడిదే ప్రమాదమా? చైనా మొబైల్‌ ఫోన్లలో రేడియేషన్‌ అధికంగా ఉంటుందా? టచ్‌ స్క్రీన్లు.. కంటిచూపును దెబ్బతీస్తాయా? చౌక ధరకు అధిక ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు వాడితే.. ఆరోగ్యానికి ప్రమాదమా? చైనా ఫోన్లు వాడితే రెటీనా దెబ్బంతింటుందనే వాదనలు.. వార్తలు కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.. ఇవి నిజమేనా? ఇటువంటి వివరాలను తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి.

చైనా స్మార్ట్‌ ఫోన్లు దాదాపు దేశాన్ని ముంచేస్తున్నాయి. పదిమందిలో ఆరుగురి చేతుల్లో కనిపించేవి చైనా ఫోన్లే. తక్కువ ధరతో మ్యాగ్జిమమ్‌ ఫీచర్లతో వినియోగదారులను ఈ ఫోన్లు కట్టిపడేశాయి. ఈ ఫోన్లను అధికంగా వాడితే ఆరోగ్యానికి, కంటికి ప్రమాదమనే సంకేతాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

చైనా ఫోన్లవల్ల మన దేశంలో చాలా కాలంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయినా మనవాళ్లు వాటిని వినియోగిస్తూనేఉన్నారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో 21 ఏళ్ల అమ్మాయి.. 24 గంటల పాటు మొబైల్‌ ఫొన్‌లో గేమ్స్‌ అడుతూ.. కంటి చూపును కోల్పోయింది. ఈ విషయంలో ఇప్పుడు చైనాలో హాట్‌టాపిక్‌గా మారింది. సుదీర్ఘ సమయంపాటు ఆన్‌లైన్‌ గేమ్‌ అయిన ’హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌‘  గేమ్‌ను అమ్మాయి ఆడుతూనే ఉంది. ఆట ఆడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె. కుడి కన్ను పూర్తిగా మసకబారింది.

చూపు కోల్పోయిన కంటిని వైద్యులు పరీక్షలు జరిపి ఆశ్చర్యకర విషయాన్ని తెలిపారు. ఇటువంటి వ్యాధిని రెటినల్‌ ఆర్టెరీ అక్లూషన్‌ (ఆర్‌ఏఓ)గా పిలుస్తారని చెప్పారు. ఇటువంటి వ్యాధి సాధారణంగా వయసు మళ్లిన వారికి వస్తుందని.. ఇంత చిన్న వయసులో రావడం అరుదని అన్నారు. ఈ అమ్మాయికి చాలా సమయం స్క్రీన్‌కేసి చూడడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చైనాలో ’హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌‘  గేమ్‌కు ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. ఇటువంటి గేమ్స్‌ ఆడే సమయంలో స్క్రీన్‌ నుంచి తక్కువ రేడియేషన్‌ వచ్చే ఫోన్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు