మరో స్కైలాబ్‌?! మహావినాశనం??

10 Nov, 2017 09:21 IST|Sakshi

చైనాకు చెందిన ఒక స్పేస్‌ స్టేషన్‌ మరో స్కైలాబ్‌ కానుందా? ఇప్పటికే భూ నియంత్రణ కోల్పోయిందా? ఒక మహానగరం మొత్తం సర్వనాశనం కానుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? భూమిపై ఎప్పుడు విలయం సృష్టిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవండి.


అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాలతో పోటీ పడే చైనా.. ప్రపంచానికి మహా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా పంపిన తియాంగాంగ్‌-1 పూర్తిగా భూ నియంత్రణ కోల్పోయినట్లు ఐరోపా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సైంటిస్టుల నియంత్రణ కోల్పోయిన ఈ స్పేస్‌ స్టేషన్‌ వచ్చే ఏడాది లోపు ఉత్తర, దక్షిణార్ధ గోళాల మధ్యలో ఎక్కడైనా పడొచ్చని వారు ప్రకటించారు.

భారీ స్పేస్‌ స్టేషన్‌
చైనా నిర్మించిన తియాంగాంగ్‌-1 8.5 టన్నుల బరువు ఉంటుంది. 12 మీటర్ల పొడవున్న తియాంగాంగ్‌ జనవరి-మార్చి మధ్య కాలంలో ఎప్పుడైనా, ఎక్కడైనా భీకరంగా నేల కూలవచ్చని సైంటిస్టుల హెచ్చరిస్తున్నారు.

ప్రమాదంలో ప్రధాన నగరాలు
ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, బీజింగ్‌, రోమ్‌, ఇస్తాంబుల్‌, టోక్యో నగరాలున్నాయి.

ప్రమాద స్థాయి
తియాంగాంగ్‌-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి.

మనకు ప్రమాదం?
తియాంగాంగ్‌-1 నుంచి భారత్‌, బ్రిటన్‌లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు