మరికొన్ని రోజుల్లో.. మహావినాశనం!

5 Jan, 2018 09:44 IST|Sakshi

చైనాకు చెందిన ఒక అంతరిక్ష కేంద్రం భూమిపై కూలిపోనుందా? భూమికి మహా వినాశనం తప్పదా? స్పేస్‌స్టేషన్‌పై సైంటిస్టులు నియంత్రణ కోల్పోయారా? కూలుతున్న అంతరిక్ష కేంద్రం భూ కక్ష్యలోకి ప్రవేశించిందా? భూమిపై విలయం ఎప్పుడు సృష్టిస్తుంది.. వంటి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. 

అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలతో అంతరిక్ష పరిశోధనల్లో పోటీపడ్డ చైనా.. ఇప్పుడు భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా ప్రత్యేకంగా తియాంగాంగ్‌-1 పేరుతో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించుకుంది. సుమారు 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్‌ స్టేషన్‌ అంతరిక్షం నుంచి భూమిపైన పడబోతోంది. తియాంగాంగ్‌-1.. 2016 మార్చిలోనే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది. అప్పటినుంచి ఆకాశంలో పరిభ్రమిస్తూ.. నెమ్మదిగా భూమివైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని సైంటిస్టులు చెబుతున్నారు. 

ఎక్కడ పడుతుంది?
ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలోని 43 డిగ్రీల అక్షాంశాల మధ్య ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి - మార్చి మధ్యకాలంలో భూమిమీద భీకరంగా కూలిపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 

ఎక్కడ పడొచ్చు?
ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, బీజింగ్‌, రోమ్‌, ఇస్తాంబుల్‌, టోక్యో నగరాలున్నాయి.

ప్రమాద స్థాయి
తియాంగాంగ్‌-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. తియాంగాంగ్‌-1 నుంచి భారత్‌, బ్రిటన్‌లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

చైనా ఏమంటోంది?
తియాంగాంగ్‌ - 1 కూలిపోవడం వల్ల భూమికి వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదని చైనా చెబుతోంది. ఈ స్పేస్‌ స్టేషన్‌ నాలుగున్నర సంవత్సరాలు పనిచేసింది. మరో రెండున్నర ఏళ్లు అదనంగా విధులు నిర్వహించింది. ఇప్పటికే స్పేస్‌ స్టేషన్‌లోకి కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని.. స్పేస్‌ ఇంజినీరింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వూ పింగ్‌ అంటున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే.. స్పేస్‌ స్టేషన్‌ మండిపోతుందని.. ఆయన చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు