మొబైల్‌ గేమ్‌ ఎంత పనిచేసింది!

11 Oct, 2017 08:39 IST|Sakshi

బీజింగ్‌: స్మార్ట్‌ఫోన్‌కి బానిసలై ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్న వారికిది నిజంగానే ఓ హెచ్చరిక. 21 ఏళ్ల యువతి స్మార్ట్‌ఫోన్‌లో 24 గంటల పాటు ఏకధాటిగా వీడియో గేమ్‌ ఆడి తన కుడి కంటి చూపును కోల్పోయింది. ఈ ఘటన వాయవ్య చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో ‘హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌’ అనే మల్టీప్లేయర్‌ గేమ్‌ ఆడుతున్న యువతికి ఒక్కసారిగా కంటి చూపు మసకమసకగా మారింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే యువతి తన కుడి కంటిచూపును కోల్పోయిందని దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది.

యువతిని దగ్గర్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా.. చూపు కోల్పోడానికి గల కారణాన్ని గుర్తించలేకపోయారు. చివరికి నాన్‌చాంగ్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రి ‘రెటినాల్‌ ఆర్టరీ అక్జూజన్‌’అనే సమస్య కారణంగా యువతి చూపు కోల్పోయినట్లు గుర్తించింది. ఈ యువతి స్థానికంగ ఉన్న కంపెనీలో ఫైనాన్స్‌ విభాగంలో పనిచేస్తునట్లు తెలిసినా.. పేరు కానీ, ఇతర ఏ వివరాలు కానీ తెలియరాలేదని పేర్కొంది. హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌కు కేవలం చైనాలోనే సుమారు 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

మరిన్ని వార్తలు