సౌదీ వాసులకు మళ్లీ సినిమా పండుగ

11 Dec, 2017 15:34 IST|Sakshi

దుబాయ్‌ : సౌదీ అరేబియా వాసులకు 2018లో తొలిసారి థియేటర్లలో సినిమాను వీక్షించే అవకాశం దక్కనుంది. 2018 నుంచి పబ్లిక్‌ థియేటర్లను అనుమతించనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా సాంస్కృతిక సమాచారా శాఖ మంత్రి అవాద్‌ బిన్‌ సాలే అలావద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

'తొలి సినిమాను మేం మార్చి 2018లో వస్తుందని అంచనా వేస్తున్నాం' అని ఆయన అన్నారు. సాధరణంగా సౌదీ అరేబియాలో సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. కొన్ని మాత్రమే ఫీచర్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీస్‌ ప్రతి ఏడాది వస్తుంటాయి. ఒక్క కోబార్‌లోని ఐమాక్స్‌ తప్ప మిగితా ఏ ప్రాంతాల్లో కూడా సినిమా హాళ్లు అనేవి లేవు. ఎప్పటి నుంచో వాటిని ప్రారంభించాలని చర్చలు జరుగుతున్నప్పటికీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సౌదీలో ఆ నిర్ణయం ముందుకు వెళ్లలేదు. తాజాగా జరిపిన చర్చల్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు సౌదీలో శాటిలైట్‌ ద్వారా, డీవీడీలు, వీడియోల ద్వారా మాత్రమే సినిమాలు వీక్షించేవాళ్లు. గత కొన్నేళ్లుగా సౌదీలో సినిమాలను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు