ప్రపంచంలో ఉత్తమ, చెత్త నగరాలివే

14 Mar, 2017 09:45 IST|Sakshi
ఆస్ట్రియా రాజధాని వియన్నా

లండన్‌: అత్యున్నత జీవన ప్రమణాలు కలిగివున్న నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టెంట్‌ సంస్థ మెర్సర్‌.. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో అభిప్రాయసేకరణ నిర్వహించి వెల్లడించిన జాబితాలో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో అత్యంత చెత్తనగరంగా బాగ్దాద్‌ చివరిస్థానంలో నిలిచింది.

రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం మరియు రవాణా ప్రమాణాలు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్‌, పారిస్‌, టోక్యో, న్యూయార్క్‌ నగరాలు టాప్‌ 30లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. వియన్నాతో పాటు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌, జర్మనీలోని మ్యూనిచ్‌, కెనడాలోని వాంకోవర్‌లు వరుసగా టాప్‌ 5లో నిలిచాయి. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్‌(25వ ర్యాంకు) నిలిచింది. అమెరికా నుంచి ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన నగరం శాన్‌ఫ్రాన్సిస్కో(29వ ర్యాంకు).

మరిన్ని వార్తలు