సీఏఏ అవసరం లేదు

20 Jan, 2020 02:11 IST|Sakshi

భారత్‌ ఎందుకు ఈ చట్టం చేసిందో అర్థం కావడం లేదు

బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా  

దుబాయ్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) ఈ రెండూ భారత్‌ అంతర్గత వ్యవహారాలని బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సీఏఏ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ‘సీఏఏ ఇప్పుడు చేయాల్సిన పని లేదు. మరి భారత ప్రభుత్వం ఎందుకు ఈ చట్టం చేసిందో అర్థం కావడం లేదు’’అని యూఏఈ రాజధాని అబూధాబిలో హసీనా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్‌ నుంచి ఎలాంటి తిరుగు వలసలు లేవని, అయితే దేశంలో ప్రజలే బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సీఏఏకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన తర్వాత ముగ్గురు బంగ్లాదేశ్‌ మంత్రులు భారత పర్యటన రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్, పాక్, అప్ఘానిస్తాన్‌లో ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని వీలు కల్పించే ఈ చట్టంపై భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు