అమ్మకానికి దేశదేశాల పౌరసత్వం

4 Aug, 2018 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి కరీబియన్‌ ఐలాండ్‌ ఆంటిగ్వా పౌరసత్వం లభించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయిన చోక్సీ ముందుగా ఆంటిగ్వా శరణుకోరారు. ఆ తర్వాత పౌరసత్వాన్నే కొనుక్కున్నారు. ఇక్కడ పౌరసత్వం కొనుక్కోవడం అంటే ఆ దేశంలో వ్యాపారం పేరిట కొంత నిర్ణీత సొమ్మును పెట్టుబడిగా పెట్టడం.

ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పౌరసత్వాన్ని పెట్టుబడుల రూపంలో కొనుక్కునే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల పౌరసత్వం కావాలంటే కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. కరీబియన్‌ ఐలాండ్‌లో చాలా సులభంగా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు. ఆంటిగ్వా, బార్బుడా లాంటి కరీబియన్‌ దేశాల్లో 25 వేల అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టి, ఐదేళ్ల కాలంలో ఐదు రోజులుంటే తక్షణమే పౌరసత్వం, పాస్‌పోర్టు అభిస్తుంది. అదే ఆస్ట్రేలియాలో పౌరసత్వం రావాలంటే 50 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఏడాదికి 40 రోజులు నివాసం ఉంటే ఐదేళ్లకాలానికి పౌరసత్వం, పాస్‌పోర్టు లభిస్తుంది.

అదే కెనెడా దేశంలో ఐదు లక్షల కెనడా డాలర్లను పెట్టుబడులుగా పెడితే ఐదేళ్ల కాలానికి 730 రోజులు నివాసం ఉంటే మూడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. ఇక అమెరికాలో ఐదు లక్షల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి ఏడాదికి 180 రోజులు నివాసం ఉంటే ఏడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది.

మరిన్ని వార్తలు