ఆ పద్ధతి ప్రమాదకరం!

5 Jun, 2020 04:37 IST|Sakshi

లీ పెక్‌(ఫ్రాన్స్‌): ఫ్లాయిడ్‌ హత్యతో ప్రపంచవ్యాప్తంగా పోలీసుల దాష్టీకాలు, అనుమానితులతో వారు వ్యవహరించే తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్లాయిడ్‌ విషాధ ఘటన జరిగిన మూడు రోజులకే ఫ్రాన్స్‌లోని పారిస్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక నిందితుడిని పోలీసులు రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, మెడపై మోకాలు ఆన్చి, చేతులకు సంకెళ్లు వేశారు. అరెస్ట్‌ చేయాలనుకునే వ్యక్తులను ఎటూ కదలకుండా ఉంచడం కోసం మోకాళ్లతో వారిని అణచిపెట్టడం ప్రపంచవ్యాప్తంగా పోలీసులంతా సాధారణంగా అనుసరించే విధానమే.

అయితే, నిరాయుధులను, ఎలాంటి వ్యతిరేకత చూపని వారిని అలా నిర్బంధించడం, లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వకుండా, ఊపిరాడకుండా చేసి, వారు చనిపోయేందుకు కారణం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘పోలీసులు ఇలా వ్యవహరించడం మా వద్ద కూడా జరుగుతుంది’అని ఫ్రాన్స్‌ ఎంపీ ఫ్రాంకోయిస్‌ రుఫిన్‌ వ్యాఖ్యానించారు. హాంకాంగ్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై అక్కడి పోలీసులు ఇలాంటి హింసాత్మక విధానాలనే అవలంబిస్తుంటారు. మెడపై ఒత్తిడి చేసి, శ్వాస అందకుండా చేయడమనే విధానం మా వద్ద లేదని ఇజ్రాయెల్‌ పోలీస్‌ విభాగ అధికార ప్రతినిధి మికీ రోజెన్‌ఫీల్డ్‌ స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు