ముంచుతున్న మంచు!

22 May, 2019 10:31 IST|Sakshi

లండన్‌ : చంద్రుడు కుంచించుకుపోతున్నాడం టూ ఇటీవలే ఓ వార్తను మనమంతా చదివాం. ఇప్పుడు భూమికీ అదే దుస్థితి దాపురిస్తోంది. అయితే చంద్రుడి మీద పరిస్థితికి అక్కడి ప్రకృతే కారణం కాగా... భూమికి ఈ దుస్థితి దాపురించడానికి మాత్రం మానవ చర్యలే కారణమవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల వినియోగం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వాయువులు వెరసి రోజురోజుకీ భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా ధృవ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు అంచనాలకు మించి పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

భారీ మంచు ఫలకాలు కరగడమే కారణం... 
గ్రీన్‌లాండ్‌ ద్వీపం సహా అంటార్కిటికా ఖండంలో ఉండే అతి భారీ మంచు ఫలకాలు వేగంగా కరుగుతుండడమే సముద్ర మట్టాలు పెరగడానికి కారణమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. యూకేలోని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయానికి  చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన వివరాలను నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతవాసులకు ముప్పు ఏర్పడడంతోపాటు పర్యావరణ వ్యవస్థకు నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదలకు సంబంధించి శాస్త్రీయ అంచనాలు, ప్రణాళిక  వ్యూహాలు, చర్యలు తదితర వివరాలు ఈ నివేదికలో వివరించారు. 

2100 నాటికి... 
స్ట్రక్చర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ జడ్జిమెంట్‌ (ఎస్‌ఈజే) అనే పరిజ్ఞానం ఉపయోగించి గ్రీన్‌లాండ్, పశ్చిమ, తూర్పు అంటార్కిటిక్‌ ప్రాంతాల్లోని మంచు ఫలకాల పరిధిని అంచనా వేశారు. ఈ విషయమై బ్రిస్టల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జొనాథన్‌ బాంబర్‌ మాట్లాడుతూ... ‘ఈ పరిజ్ఞానంతో అంచనా వేస్తే.. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన పక్షంలో 2100 నాటికల్లా సముద్ర మట్టం రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 1.79 మిలియన్ల చదరపు కిలోమీటర్ల భూమి కోల్పోనున్నట్లు అంచనా. ఇందులో ఉపయోగకరమైన సాగు భూమి కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 187 మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంద’ని బాంబర్‌ తెలిపారు. ఇది మానవాళికి తీవ్రమైన ముప్పేనని ఆయన విశ్లేషించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌