కొలంబియా మోడల్ కు 15 ఏళ్ళ జైలు!

26 Jul, 2016 17:29 IST|Sakshi
కొలంబియా మోడల్ కు 15 ఏళ్ళ జైలు!

బీజింగ్ః మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా కేసులో ఓ మోడల్ కు 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది.  డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోందన్న ఆరోపణలతో గతేడాది కాలంగా ఆమెపై విచారణ జరుగుతోండగా.. చివరికి ఆమె దోషిగా తేలడంతో శిక్షను విధిస్తూ చైనా కోర్టు తీర్పునిచ్చింది.

చైనా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన 22 ఏళ్ళ కొలంబియన్ మోడల్ కు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. జులియానా లోపేజ్ గతంలో స్వంతగా ఓ బొటిక్ ను నడిపించేది. అంతేకాక ఓ టీవీ షోలో కూడా ఆమె ఓ సొంత కార్యక్రమాన్ని చేసేది. అలాగే  ప్రొ ఫుట్ బాలర్ గా కూడా ఆమె అందరికీ తెలుసు. అయితే తన ల్యాప్  తో డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తోందన్న అనుమానంతో గతేడాది  ఆమెను చైనా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన బొటిక్ కోసం వస్తువులు కొనేందుకు కుటుంబ సభ్యులతో కలసి  గాంగ్జూ వెళ్ళిన జూలియానా... అక్కడ వారినుంచీ తప్పిపోవడంతో అంతా ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో జూలియానాను చైనా పోలీసులు అరెస్టు చేశారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారుకూడా. నిషేధిత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పెద్ద మొత్తంలో ఆమెవద్ద గుర్తించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అప్పట్నుంచీ విచారణ ఎదుర్కొంటున్న జూలియానా దోషిగా తేలడంతో  15 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ చైనా కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక ఆమె జైలు శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను చైనా నుంచి బహిష్కరించాలని కూడా గంగ్వ్సూ పీపుల్స్ ఇంటర్మీడియల్ కోర్టు ఆదేశించింది.

గతేడాది జూలై 18న గాంగ్జూ వెళ్ళిన జూలియానా.. బైయున్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో  610 గ్రాముల కొకైన్ ను లాప్ టాప్ లో కనిపించకుండా దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబియాలో మిస్ యాంటియోక్వియా బ్యూటీ కాంటెస్ట్ లో విన్నర్ అయిన జూలియానా అనంతరం మిస్ వరల్డ్ కొలంబియాలోనూ గెలిచి, మిస్ వరల్డ్ చైనాగా నిలవాలనుకుంది. అదే సమయంలో ఆమె చైనాలో తప్పిపోయిందని, మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులో విచారణ ఎదుర్కొంటోందని తెలిసి  ప్రపంచం నివ్వెరపోయింది. తనకు ఓ వ్యక్తి స్మగ్లింగ్ లో హెల్స్ చేస్తే 2,500 డాలర్లు ఇస్తానన్నాడని, లేదంటే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడని అందుకే తాను స్మగ్లింగ్ కు పాల్పడినట్లు కోర్టు ముందు ఒప్పుకుంది. అయితే జూలియానా పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను తనతో తీసుకువెళ్ళడాన్ని కోర్టు తప్పుబట్టింది. భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు