తోక లేని ‘తోక చుక్క’

1 May, 2016 16:59 IST|Sakshi
తోక లేని ‘తోక చుక్క’

వాషింగ్టన్: విశ్వంలోనే తొలిసారిగా మన సౌరకుటుంబంలో శిలలతో నిండిన తోక లేని ‘తోక చుక్క’ ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సీ/2014 ఎస్3గా పిలిచే ఈ తోక చుక్క తన కక్ష్యలో పూర్తి భ్రమణం పూర్తిచేసేందుకు 860 సంవత్సరాలు పడుతుంది. భూమి ఆవిర్భవించిన కాలంలో ఈ చుక్క ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఖగోళశాస్త్రవేత్తలు మ్యాన్క్స్(తోక లేని పిల్లి జాతి)గా పిలుచుకునే ఈ చుక్క సౌర మండలం ఆవల ఉన్న ఓర్ట్ క్లౌడ్ ప్రాంతంలో పరిభ్రమిస్తోంది. అత్యంత ఎక్కువ భ్రమణకాలం ఉన్న గ్రహశకలం లాంటి పదార్ధం ఇదేనని హవాయి వర్సిటీ పరిశోధకుడు కరేన్ మీక్ తెలిపారు.

మరిన్ని వార్తలు