క్లౌడ్‌ సేవల్లో దూసుకుపోనున్న ఐబీఎం

10 Jul, 2019 16:26 IST|Sakshi

న్యూయార్క్‌ : టెక్నాలజీ దిగ్గజం ఐబిఏం క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో అడుగుపెట్టేందుకు సాప్ట్‌వేర్‌ కంపెనీ రెడ్‌ హ్యట్‌ను 34బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్టు వెల్లడించింది. మెరుగైన లాభాలను ఆర్జిస్తూ వంద ఏళ్ల చరిత్ర ఉన్న రెడ్‌ హ్యట్‌ కంపెనీని గత ఏడాది ఐబిఏం కొనుగోలు చేయడానికి నిర్ణయించింది.  ఐబిఏం చీఫ్‌ ఎగ్జక్యూటివ్‌ గిన్ని రోమెట్టి సాంప్రదాయ హర్ఢ్‌వేర్‌ ఉత్పత్తులను తగ్గించి, వేగంగా అభివృద్ది చెందుతున్నసాప్ట్‌వేర్‌ సేవలపై, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ భారీ కొనుగోలుకు మార్గం సుగమమైంది.

63 శాతం ప్రీమియంతో రెడ్‌ హ్యట్‌ షేర్లను ​కొనుగోలు చేయడానికి జూన్‌ నెలఖారున ఈయు రెగ్యులేటర్లు, మే నెలలో యుఏస్‌ రెగ్యులేటర్లు ఐబిఏం ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. 1993లో స్థాపించిన రెడ్‌ హ్యట్‌ సంస్థ లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో ప్రత్యేకతను ఎర్పరుచుకుంది. ఇది మైక్రోసాప్ట్‌ కార్ప్‌చే తయారు చేయబడిన సాప్ట్‌వేర్‌కు కంటే భిన్నంగా ఉండి,  ఓపెన్‌ సోర్స్‌ సాప్టవేర్‌గా  లైనక్స్‌ అత్యంత ఆదరణ పోందింది.

మరిన్ని వార్తలు