‘భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు’

2 Oct, 2019 16:25 IST|Sakshi

వాషింగ్టన్‌ : జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భారత్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దాడులు జరుపొచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలను పాక్‌ కట్టడి చేయపోతే ముష్కరులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఆర్టికల్‌ 370 రద్దు చేస్తు భారత ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని ఉగ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు. భారత్‌లో పాక్‌ ఉగ్రవాదులు దాడులు చేయడానికి కుట్రలు పన్నారనే అనుమానం కలుగుతోంది. ఉగ్ర సంస్థలను పాక్‌ కట్టడి చేయపోతే భారత్‌లో కచ్చితంగా దాడులు జరుగుతాయి. ఈ విషయంలో పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇవ్వకపోవచ్చు. దౌత్య, రాజకీయ పరంగానే పాక్‌కు చైనా మద్దతు ఇవ్వొచ్చు కానీ ఉగ్రసంస్థలను పోషించడంలో సహకరించకపోవచ్చు’  అని అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫక్‌ సెక్యూరిటీ అఫైర్స్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ అభిప్రాయ పడ్డారు.

ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు విషయంలో పాక్‌ చేస్తున్న ఆరోపణలకు చైనా మద్దతుపై స్పందిస్తూ శ్రీవర్‌ పై విధంగా స్పందించారు. దౌత్య, రాజకీయ అంశాలలో మాత్రమే పాక్‌కు చైనా మద్దతు ఇస్తుందని తాము భావిస్తున్నామన్నారు. భారత్‌తో స్నేహానికి చైనా సిద్దంగా ఉందన్నారు. కొన్ని విషయాలో మాత్రమే చైనా పాక్‌కు మద్దతు ఇస్తుందని శ్రీవర్‌ అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా