తైవాన్ లో తుపాను బీభత్సం

14 Sep, 2016 21:51 IST|Sakshi
తైవాన్ లో తుపాను బీభత్సం

తైపీ: తూర్పు ఆసియా దేశం తైవాన్ను మెరాంటి తుపాను చుట్టుముట్టింది. గంటకు 227 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను ధాటికి ఆ దేశంలోని తూర్పు, దక్షిణ తీరాలు అతలాకుతలం అయ్యాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ఊళ్లన్నీ జలమయం అయ్యాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

గడిచిన 120 ఏళ్లలో తైవాన్ ను ముంచెత్తిన భారీ తుపాను ఇదే కావడంతో తీవ్రమైన నష్టం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. పర్యాటక ప్రాంతాలు, తీరప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పది  మీటర్ల ఎత్తులో విరుచుకుపడిన కెరటాల ధాటికి  దక్షిణ తైవాన్ కౌంటీలో ఓ  షిప్పింగ్ పోర్ట్ లోని లైట్ హౌస్ పూర్తిగా సముద్రంలోకి తిరగబడిందని ప్రభుత్వం వెల్లడించింది.  కేయాంహ్స్  పోర్ట్ నగరంలో కనీసం 10 సరుకు రవాణా ఓడలు, రెండు కార్గో క్రేన్లు,  1,40,000 టన్నుల నౌక సైతం ధ్వంసమయింది. మెరంటో ధాటికి భారీ  కంటైనర్లు సైతం తిరగబడ్డాయి. పాఠశాలలును మూసివేశారు. 65,000 మంది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశీయంగా 300 పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇతర రవాణా సేవలు నిలిచిపోయాయి. వీదులన్నీ జలమయమయ్యాయి. పలు వాణిజ్య సముదాయాలు చెల్లాచెదురయ్యాయి. కొరంటి దక్షిణ చైనా వైపు కదులుతుండడంలో ఆ దేశం తీరప్రాంత ప్రజలను హెచ్చరించింది. అధికారులను భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది.

మరిన్ని వార్తలు