కారు కొనేందుకు కారేసుకెళ్లిన బుడ్డోడు

6 May, 2020 09:23 IST|Sakshi

కాలిఫోర్నియా: అమ్మ తిట్టింద‌నో, నాన్న కొట్టాడ‌నో పిల్ల‌లు అలుగుతుంటారు.. అది స‌హ‌జం. అయితే ఓ ఐదేళ్ల‌ బుడ్డోడు మాత్రం అలిగి బుంగ‌మూతి పెట్టుకుని కూర్చోలేదు. త‌ను కోరింది ద‌క్కాల్సిందేన‌న్న‌ మంకుప‌ట్టుతో చెప్పాపెట్టకుండా కారేసుకుని వెళ్లిపోయాడు. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ బుడ‌త‌డు డ్రైవింగ్ చేయ‌డం చూసి ఖంగు తిన్నారు. ఈ ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న సోమ‌వారం అమెరికాలోని ఉటావాలో జ‌రిగింది. ఓ బాలుడు త‌న త‌ల్లిని ఖరీదైన లంబోర్గిని కారు కొనివ్వ‌మ‌ని అడిగాడు. అందుకు అత‌ని త‌ల్లి నిరాక‌రించింది. (సైకిల్‌పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి)

దీంతో స్వ‌యంగా అత‌నే వెళ్లి తెచ్చుకోవాల‌ని భావించిన పిల్లవాడు మూడు డాల‌ర్లు వెంట పెట్టుకుని ఇంట్లో మాటైనా చెప్ప‌కుండా త‌న పేరెంట్స్‌ ఎస్‌యూవీ కారు తీసుకుని కాలిఫోర్నియాకు బ‌య‌లు దేరాడు. మార్గ‌మ‌ధ్యంలో అనుమానం వ‌చ్చిన‌ పోలీసులు అత‌డిని అడ్డుకున్నారు. నీకు ఐదేళ్లే క‌దా? ఇంత చిన్న వ‌య‌సులో డ్రైవింగ్ ఎక్క‌డ నేర్చుకున్నావ్? అంటూ ప్ర‌శ్న‌లు కురిపించారు. అదృష్ట‌వ‌శాత్తూ అత‌ని డ్రైవింగ్‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు పేర్కొన్నారు. సుమారు నాలుగైదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు అత‌ను కారు న‌డిపాడ‌ని తెలిపారు. త‌ర్వాత అత‌డిని మంద‌లించి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. (డిస్ట్రబ్‌ చేసింది.. స్టార్‌ అయ్యింది)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు